|
modi add 1

ప్రగతి హైస్కూల్ లో ఘనంగా మెగా సైన్స్ ఫేర్

రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయికల్ ఎమ్మార్వో మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం, మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు విచ్చేసి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన వర్కింగ్ మోడల్స్ ను వీక్షించి, చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని, విద్యార్థులను చూస్తూ ఉంటే బాల శాస్త్రవేత్తలుగా కనిపిస్తున్నారని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు చేయడం, చాలా బాగుందని అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఏటీఎం, రోబో, అగ్నిపర్వత విస్ఫోటనం, కిడ్నీ, చంద్రయాన్ వర్కింగ్ మోడల్, సూర్య కుటుంబం, రక్త ప్రసరణ, మినీ ఎయిర్ కూలర్, దాదాపు 170 కి పైగా వర్కింగ్ మోడల్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలె శేఖర్ జయశ్రీ, అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 28, 2024 | 0 Comments

SSC-2026 ఫలితాలలో ప్రగతి ప్రభంజనం

బుధవారం విడుదలైన పదోతరగతి ఫలితాలలో రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. చిలుక సహస్ర 575 మార్కులు సాధించి రాయికల్ మండల్ టాపర్ గా నిలిచింది. అల్లకొండ సాయిరాం 572 మార్కులు, బిట్ల శ్రావ్య 571, బందారపు హశ్విక 570 మార్కులు సాధించారు. 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల సంఖ్య 20మంది ,500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 63మంది , వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ తెలిపారు.

By Gantyala Praveen | April 29, 2026 | 0 Comments

Hot Categories

2
7
1