రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లాకు చెందిన రాంబాబు మేస్త్రి కొంతకాలంగా కుమ్మరిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఉదయం లేబర్ ను తీసుకు రావడానికి కారులో వెళ్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు


Comments 0