|
modi add 1

అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి అద్భుత ప్రతిభ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పతకాల పంట

అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి అద్భుత ప్రతిభ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పతకాల పంట జాతీయ స్థాయిలో కరీంనగర్ పోలీస్ కీర్తిని చాటిన హుజురాబాద్ ఏసీపీ మాధవి. కరీంనగర్, మే 15, 2026: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఈనెల 9వ తేదీ నుండి 13వ తేదీ (09.05.2026 నుండి 13.05.2026) వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "అఖిల భారత పోలీస్ క్రీడా పోటీల" (All India Police Games) లో కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ ఏసీపీ (ACP) వి. మాధవి గారు అద్భుత ప్రదర్శనతో రాణించి ఘన విజయం సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన గట్టి పోటీని తట్టుకొని, టేబుల్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ విభాగాల్లో ఆమె ఏకంగా నాలుగు పతకాలను కైవసం చేసుకుని రాష్ట్ర పోలీస్ శాఖకు, కరీంనగర్ కమిషనరేట్‌కు తీరని కీర్తిని తెచ్చిపెట్టారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి సాధించిన పతకాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: టేబుల్ టెన్నిస్ (Table Tennis) విభాగం: జి.ఓ. 50+ (G.O. 50+) విభాగం: మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచి రజత పతకం (Silver Medal) సాధించారు. జి.ఓ. 40+ (G.O. 40+) విభాగం: మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో గట్టి పోటీనిచ్చి కాంస్య పతకం (Bronze Medal) కైవసం చేసుకున్నారు. ఎన్.జి.ఓ. (N.G.O.) విభాగం: మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రాణించి కాంస్య పతకం (Bronze Medal) సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ (Badminton) విభాగం: జి.ఓ. 50+ (G.O. 50+) విభాగం: మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో అద్భుత ఆటతీరుతో కాంస్య పతకం (Bronze Medal) సాధించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఘన అభినందనలు: జాతీయ స్థాయిలో ఒకే క్రీడా పోటీలలో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి భిన్నమైన విభాగాల్లో నాలుగు పతకాలు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించిన హుజూరాబాద్ ఏసీపీ మాధవి పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మరియు సహచర అధికారులు ఘనంగా అభినందించారు. విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉంటూనే, క్రీడల పట్ల మక్కువతో కఠోర శ్రమకోర్చి జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

By NYALAKONDA ANIL DESAI | May 16, 2026 | 0 Comments

జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ కి ఎంపికైన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థిని

జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ కి ఎంపికైన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థిని నిజామాబాదు : ఇటీవల మెదక్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ లో మెరుగైన ప్రతిభ కనబరిచిన బ్లూమింగ్ బడ్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న Y.ప్రజ్ఞ జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. నిజామాబాద్ జిల్లా నుంచి జాతీయస్థాయి కి తమ విద్యార్థి ఎంపిక కావడం ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ ప్రసన్నకుమారి విద్యార్థిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ 6 నుంచి 10 తేది వరకు జమ్మూ కాశ్మీర్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఆటలలో ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థినిని అభినందించారు.

By NYALAKONDA ANIL DESAI | November 26, 2024 | 0 Comments

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..

సుల్తానాబాద్,మే 2 (జనం గొంతు ):విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రేగడి మద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాధాస్వామి, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి అన్నారు.సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఆదేశాల మేరకు పి ఈ టి దాసరి రమేష్ ఆధ్వర్యంలో వేసవికాల టెన్నికాయిట్ క్రీడా శిబిరమును పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాస్వామి, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు, క్రీడల్లో పాల్గొని మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరిక ధారుఢ్యనికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల ఎస్ జి ఎఫ్ కన్వీనర్ ప్రణయ్, టెన్నికాయిట్ జాతీయ క్రీడాకారుడు బలరాం, రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ సెక్రెటరీ, అల్లిపూర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ లలిత, సతీష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | May 02, 2024 | 0 Comments

10వతరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ZPHS ఆలూరు గ్రామ పాఠశాల యందు 10వతరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కూర్మాచలం రఘునందన్ గారు పదవ తరగతి ఏ విధంగా సంసిద్ధత కావాలి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎలా రూపొందించుకోవాలి అని అదేవిధంగా పరీక్షలు ఏ విధంగా రాయాలి. పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత పై తరగతులకు వెళ్లేటప్పుడు అందరూ ఒకరిని చూసి ఒకరు అనుకరించకుండా తమ తమ నైపుణ్యం ఆధారంగా పై తరగతికి సంబంధించిన కోర్సులలో చేరాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క బలాలు.... బలహీనతలు... అవకాశాలు... అవరోధాలు.... ఏలా ఎదుర్కోవాలి. నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, సంఘంలో సమాజంలో విద్యార్థుల పాత్ర అన్న మొదలైన విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉదయభాస్కర్ గారు, ఉపాధ్యాయులు రాజగోపాల్ రమేష్ ,శ్రీనివాస్ , వినోద్, సంపత్ , స్వర్ణలత మొదలైన వారు పాల్గొన్నారు. రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ZPHS ఆలూరు గ్రామ పాఠశాల యందు 10వతరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కూర్మాచలం రఘునందన్ గారు పదవ తరగతి ఏ విధంగా సంసిద్ధత కావాలి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎలా రూపొందించుకోవాలి అని అదేవిధంగా పరీక్షలు ఏ విధంగా రాయాలి. పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత పై తరగతులకు వెళ్లేటప్పుడు అందరూ ఒకరిని చూసి ఒకరు అనుకరించకుండా తమ తమ నైపుణ్యం ఆధారంగా పై తరగతికి సంబంధించిన కోర్సులలో చేరాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క బలాలు.... బలహీనతలు... అవకాశాలు... అవరోధాలు.... ఏలా ఎదుర్కోవాలి. నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, సంఘంలో సమాజంలో విద్యార్థుల పాత్ర అన్న మొదలైన విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉదయభాస్కర్ గారు, ఉపాధ్యాయులు రాజగోపాల్ రమేష్ ,శ్రీనివాస్ , వినోద్, సంపత్ , స్వర్ణలత మొదలైన వారు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

జాతీయ కరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

ఫిబ్రవరి 12 (జనం గొంతు ): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ నెల 11వ తేదీ ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో షోటో కాన్ జపాన్ కరాటే-డూ ఇండియా హోంబు, ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జి హర్షవర్ధన్ కట 12 సంవత్సరాల విభాగంలో బంగారు పతకం,కుంత్త్ విభాగంలో బంగారు పతకం సాధించగా కరీంనగర్ జిల్లాలో జరిగిన ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో కటా 9 సంవత్సరాల విభాగంలో జి.రిషివర్ధన్ బంగారు పతకాలు సాధించారు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 13, 2024 | 0 Comments

Hot Categories

2
7
1