నేడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ జ‌యంతి * జ‌ర్న‌లిస్టుల‌కు జాతీయ సేవా పుర‌స్కారాల ప్రదానం హైద‌రాబాద్: భాగ్య‌న‌గ‌ర్ శివాజీ సేవాస‌మితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి సందర్భంగా గురువారం జర్నలిస్టులకు జాతీయ సేవా పురస్కారాల ప్రదానం చేయనున్నారు.‌కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహా పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గ‌త 28 సంవ‌త్స‌రాలుగా అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూ స‌మాజ నిర్మాణంలో త‌మ వంతు పాత్ర పోషిస్తున్న వారికి ఏటా పురస్కారాలు ఇస్తున్నట్లు భాగ్య‌న‌గ‌ర్ శివాజీ సేవాస‌మితి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నందనం దివాకర్ తెలిపారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది పాత్రికేయులను సన్మానిస్తున్నట్లు చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు సేంద్రియ రైతులు, శాస్త్ర‌వేత్త‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లు, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు, క‌వులు-ర‌చ‌యిత‌లు, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, కార్గిల్‌యోధులు, అయోధ్య క‌ర‌సేవ‌కులు...ఇలా అనేక రంగాల వారికి జాతీయ సేవా పుర‌స్కారాలు ప్ర‌దానం చేసినట్లు వివరించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండ‌లం రంగారెడ్డి న‌గ‌ర్. శివాజీ చౌక్‌ వద్ద గురువారం సాయంత్రం 5 గంట‌లకు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నంద‌నం దివాక‌ర్‌ కోరారు.