పద్మావతి కాలనీలో ఆదివారం సాయంత్రం ఫ్రెండ్‌షిప్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కోసం లింక్ రోడ్ల నిర్మాణం మరియు పాత రోడ్డు ల మరమ్మతులు, వీధి దీపాలు, పచ్చదనం పెంపు, పరిశుభ్రత, పిల్లల ఆట స్థలాల ఏర్పాటుకు సంబంధించి పలు ప్రణాళికలు రూపొందించారు. ఐకమత్యం, పరస్పర సహకారంతో కాలనీని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఆదర్శ కాలనీ గా తీర్చిదిద్దే సంకల్పాన్ని నివాసులు వ్యక్తం చేశారు.ఇంకా కార్యక్రమంలో లక్ష్మి నర్సయ్య, ప్రభాకర్ రెడ్డి, వెంకటరాజం, దీటి శ్రీనివాస్, నాగండ్ల రవి కుమార్, రవీందర్ రెడ్డి, రాచర్ల శ్రీనివాస్, సుంకరి శ్రీనివాస్, దాసరి రఘు, రాజిరెడ్డి, అలిశెట్టి రమేష్, బండ శ్రీనివాస్, పెరటి రఘుపతి రెడ్డి, అంబటి సతీష్, మిట్టపల్లి శంకర్, అలగం రమేష్, బొంకూరి రమేష్, సుధాకర్, జాగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments 0