ఒక్కరి కోసం అందరు... అందరి కోసం ఒక్కరు...! .. మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు మనమంతా ఐక్యంగా ఉండి సమస్యలు ఎదురైనప్పుడు ఒక్కరి కోసం అందరు .. అందరి కోసం ఒక్కరుగా కలిసికట్టుగా *ముందుకు సాగాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు అన్నారు . రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ మహోత్సవం కార్యక్రమం పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ హాజరై 2025 -27 సంవత్సర నూతన అధ్యక్షులుగా భోగ రాజేశం,ఉపాధ్యక్షుడిగా దాసరి గంగాధర్,ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేష్,కోశాధికారిగా ఆడెపు నర్సయ్య లచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత సంవత్సరం చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు.సంఘ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు సంఘంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సభ్యులకు సమాచారం అందిస్తూ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలపాలని సూచించారు.మనందరం ఐక్యంగా ఉంటే భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు పొందేందుకు తోడ్పడుతుందన్నారు.సంఘం ఎన్నికలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం మాత్రమేనని తదనంతరం అందరం కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా ఎదగాలన్నారు.విద్యార్థులకు విద్య పట్ల ప్రోత్సాహం,విద్య ఉపకరణాల కల్పన,ఆరోగ్యం,నిరుపేదలకు ప్రోత్సాహం లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.అనంతరం నూతన అధ్యక్షులు భోగ రాజేశం మాట్లాడుతూ సంఘ సభ్యులు సహకారంతో పద్మశాలి సేవా సంఘ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,రాష్ట్ర కార్యదర్శి జక్కుల చంద్రశేఖర్,మాజీ కార్యదర్శి మామిడాల లక్ష్మీనారాయణ మాజీ ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్యనారాయణ, సిరిపురం రఘు,మాజీ కోశాధికారి నర్సయ్య ఫోపా అధ్యక్షులు ఎలిగేటి రాజ్ కిషోర్,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి *ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి అనుమండ్ల తేజ ,గంట్యాల ప్రవీణ్ పోప సభ్యులు దాసరి రామస్వామి,గాజంగి రాజేశం, సింగని రాందాస్,సామల్ల గంగాధర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments 0