|
modi add 1

అక్రమనిర్బంధాలు మందిర నిర్మాణాన్ని అడ్డుకోలేవు ; VHP అరెస్టులు, గృహ

అక్రమనిర్బంధాలు మందిర నిర్మాణాన్ని అడ్డుకోలేవు ; VHP అరెస్టులు, గృహ @ ముస్లిం మెప్పుకోసం హిందూ మందిరాల ధ్వంసం @ పోలీసులను ముందు పెట్టి భయ బ్రాంతులు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం @ అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్యమం ఆగదు @ రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమించి మందిరం నిర్మించి తీరుతాం @ హిందువుల మనోభావాలు గౌరవించి మందిరం నిర్మించి తీరాల్సిందే..! @ తరతరాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి @ సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని తొక్కిపెట్టడమేనా..? @ నిజాం వారసత్వాన్ని అందుకొని హిందువులపై దాడులకు దిగితే తగిన బుద్ధి చెప్పక తప్పదు..! పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ట్ర కోకన్వీనర్ సుభాష్ చందర్ విమర్శించారు. ముస్లింల మెప్పు కోసం హిందూ మందిరాలను ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు కొనసాగాయి. మంగళవారం రోజు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ మందిరం దగ్గర కుంకుమార్చన నిర్వహించాలని చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అటువైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి కార్ఖానా, బోయిన్పల్లి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలను విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దమ్మ తల్లి మందిరం నిర్మించి, హిందువుల మనోభావాలు గౌరవించాల్సిందే నని పట్టుబట్టారు. మందిరం నిర్మించే వరకు పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ,భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం, గృహాల్లో నిర్బంధించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనకు తిరతిస్తున్నదని దానిని హిందూ సమాజం ఒప్పుకోదని హెచ్చరించారు. బడుగుల పండుగ అయిన బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా నిలిచే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలపై దాడి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో సహా నాయకులందరినీ అరెస్టు చేసి పెద్దమ్మ తల్లి పూజకు దూరం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతామని విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు. రాబోవు రోజులలో రెట్టింపు స్థాయిలో ముందుకు వెళ్లి మందిరాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. సెక్యులరిజం పేరుతో హిందూ సమాజాన్ని తొక్కి పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. పెద్దమ్మ తల్లి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించకుండా దాదాపు 1200 మంది పోలీసులను మోహరించడం నిజాం పరిపాలనకు నిదర్శనం అన్నారు. దాదాపు 2000 మంది బజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టు చేసేదాకా వదలమని పోలీసులు హెచ్చరించడం దుర్మార్గమని నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రధాన పీఠ వేస్తున్నారని, అదే సమయంలో హిందువుల మనోభావాలను పూర్తిగా విస్మరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరును విశ్వహిందూ పరిషత్ నేతలు తప్పు పట్టారు. తరతరాలుగా పూజలందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని అపవిత్రం చేసి, మందిరాన్ని ధ్వంసం చేసి , హిందువులపై ఘోరమైన కేసులు నమోదు చేయడం , లాఠీచార్జ్ చేయడం, మహిళలను చితకబాదడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. అమ్మవారి విగ్రహాన్ని అపవిత్రం చేసి, విగ్రహాన్ని తరలించి, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల మాదిరి హిందూ నాయకులపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, భయభ్రాంతులకు గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారు హెచ్చరించారు. నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అన్నింటిని ఎదుర్కొని.. పెద్దమ్మతల్లి పవిత్రతను కాపాడి భవ్యమైన మందిర నిర్మాణం నిర్మాణం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. అరెస్టులు, అక్రమ కేసులు తమకు కొత్త కాదని.. లక్ష్యం చేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని విశ్వహిందూ పరిషత్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భవదీయ పగుడాకుల బాలస్వామి ప్రచార ప్రముఖ్ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం 99129 75753 9182674010

By NYALAKONDA ANIL DESAI | August 12, 2025 | 0 Comments

కార్లు కుదవ పెట్టి మోసాలకు పాల్పడ్డ డ్రైవర్ అరెస్ట్

గోదావరిఖని ఎల్బీ నగర్‌కి చెందిన కారు డ్రైవర్‌ మారుపెల్లి ప్రణయ్ భాస్కర్ (29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరాయికి తీసుకున్న, స్నేహితుల వద్ద నుండి తెచ్చుకున్న నాలుగు కార్లను ఇతరుల వద్ద తనఖా పెట్టి సుమారు రూ.10 లక్షలు తీసుకొని మోసపూరితంగా వినియోగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, 4 కార్లు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ వాహనాలు తనఖా పెట్టే ముందు యజమాని వివరాలు, పత్రాలు ఖచ్చితంగా పరిశీలించాలంటూ ప్రజలకు సూచించారు.

By Ambati Sathish kumar | August 08, 2025 | 0 Comments

అక్రమ ఇసుక నిల్వలపై కఠిన చర్యలు తప్పవు – వన్‌టౌన్ సీఐ హెచ్చరిక

గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన సుమారు 130 ట్రాక్టర్ల ఇసుక డంపులను పోలీసులు గుర్తించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలో ఇసుకను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, “ఇసుకను స్వలాభం కోసం అక్రమంగా నిల్వ చేస్తే ఉపేక్షించము. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవు” అంటూ హెచ్చరించారు.

By Ambati Sathish kumar | August 05, 2025 | 0 Comments

తాళం వేసిన ఇండ్లు టార్గెట్ – రామగుండంలో ఇద్దరు దొంగలు అరెస్ట్, రూ.16 లక్షల ఆస్తి స్వాధీనం

రామగుండంలో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 10న పెట్రోలింగ్ సమయంలో పట్టుబడిన నిందితుల వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, బైకులు, ఫోన్లు, డీజే సిస్టం, నగదు స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో చేసిన 9 దొంగతనాల కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

By Ambati Sathish kumar | July 11, 2025 | 0 Comments

డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు: ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష

రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన 10 మందిని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మొత్తం రూ.16,000 జరిమానా విధించగా, రెండోసారి ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరికి మూడురోజుల జైలు శిక్ష విధించడంతో వారిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.

By Ambati Sathish kumar | July 07, 2025 | 0 Comments

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడుపుకోవాలి పోత్కపల్లి ఎస్ఐ దికొండ రమేష్

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడుపుకోవాలి పోత్కపల్లి ఎస్ఐ దికొండ రమేష్ జనం గొంతు /ఓదెల/ సతీష్ కుమార్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు మీకోసం లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు.. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు మీకోసం కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు 18 సంవత్సరాలు పైబడిన వాళ్లే ఆటో నడపాలని నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలన్నారు. 1)ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి 2)మద్యం తాగి ఆటో నడపరాదు 3)ఆటో పేపర్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి 4)ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదు 5)రోడ్లమీద ఆటోలో నిల్ప రాదు. 6) ఆటోలో అనుమాన వ్యక్తులు ప్రయాణం చేసిన యెడల పోలీసులకు తెలియజేయాలి 7) ఆటోలో మ్యూజిక్ సిస్టం పెట్టరాదు 8) మహిళల ప్రయాణికుల పట్ల వృద్దుల పట్ల గౌరవం చూపెట్టాలి, 9) పోలీసు స్టేషను లో ప్రతి ఒక్క ఆటోకు టాప్ నెంబర్ ను . తప్పకుండా ఆటో యజమానులు తమ ఆటోలకు టాప్ నెంబర్ ను వేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి ఆటోలు నడిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది పోత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు తెలిపారు. అనంతరం వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న డ్రైవర్ ఆనంద్ ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు..

By NYALAKONDA ANIL DESAI | December 28, 2024 | 0 Comments

నిజామాబాదు జిల్లా అడిషనల్ (అడ్మిన్ ) డీసీపీ గా బస్వారెడ్డి.

నిజామాబాదు జిల్లా అడిషనల్ (అడ్మిన్ ) డీసీపీ గా బస్వారెడ్డి. నిజామాబాదు : నిజామాబాదు జిల్లా అడిషనల్ డీసీపీ గా (అడ్మిన్ ) బస్వారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. అందులో భాగబగా ఆయన్ను నిజజామాబాదు జిల్లా అడిషనల్ డీసీపీ గా (అడ్మిన్ ) నియమిస్తూ ఉత్తర్వులు జారిచేశారు.

By NYALAKONDA ANIL DESAI | November 27, 2024 | 0 Comments

హత్య కేసును నీరు కారుస్తున్నారు...

హత్య కేసును నీరు కారుస్తున్నారు... కేసు నుండి నిందితులను తప్పించే ప్రయత్నం... డబ్ల్యూజేఐ నేతలతో కేంద్ర మంత్రిని కలిసిన ఇల్లందు బాధిత విలేకరి సుదర్శన్ కరీంనగర్, నవంబర్ 5:- తనను హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో పోలీసులు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల విలేఖరి నిట్ట సుదర్శన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తెచ్చారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. తనపై జరిగిన హత్యోదంతంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టే విధంగా సంబంధిత ఉన్నతాధికారులకు సూచన చేయాలని సుదర్శన్ కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. మంగళవారం బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నాయకులు న్యాలకొండ అనిల్ రావ్, తాడూరు కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్, టి సత్యనారాయణ, దారం జగన్నాథరెడ్డి, ఆడెపు లక్ష్మీనారాయణ, మొగురం రమేష్ తదితరులతో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిశారు. అక్టోబర్ 17న తనపై జరిగిన దాడికి సంబంధించి సూత్రాదారుల్లో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు , రౌడీ షీటర్లు, డీఎస్పీ సమీప బంధువు ఉండడంతో కేసును నీరుగార్చేందుకు శత విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సుదర్శన్ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. స్థానిక డీఎస్పీ మొదటి నుండి కేసును నీరుగార్చేందుకు, నిందితులను కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సుదర్శన్ ఆరోపించారు. ఎమ్మెల్యేసమీప బంధువు నాగేశ్వరరావు, అనుచరుడు ఆముదాల ప్రసాద్ ఈ కేసులో ఏ-8 గా ఉన్న విషయాన్ని బాధితుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తనపై దాడికి సంబంధి స్పష్టమైన ఆధారాలు వీడియో ఫుటేజ్ రూపంలో ఉన్నప్పటికీ,అందులో కొందరిని కేసులో పేర్కొనకుండా డీఎస్పీ కిందిస్థాయి పోలీసులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని సుదర్శన్ ఆరోపించారు. తనపై దాడికి పాల్పడిన వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ బాధ్యత డిఎస్పీపై ఉన్నప్పటికీ, ఆయన ఆ బాధ్యతను విస్మరించారని అన్నారు. సమాజంలో జరిగే తప్పులను ఎత్తిచూపే జర్నలిస్టులపై ఏకంగా దాడులు, హత్యా యత్నాలు జరుగుతున్నా ... అందుకు సంబంధించిన వీడియోలు కళ్ల ముందు కనబడుతున్నా ... అధికార ఎమ్మెల్యే అండదండలు, పోలీసు ఉన్నతాధికారుల ఆశీస్సులతో తనపై జరిగిన హత్య కేసు నీరు కార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సుదర్శన్ కేంద్రమంత్రికి తెలిపారు. కేసులో పేర్కొన్న నిందితుల ఫోన్ డేటా పరిశీలిస్తే ... వారికి అండగా ఉన్న రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పాత్ర బయట పడుతుందని,కనుక ఆ దిశగా విచారణ జరిగేలా చూడాలని సుదర్శన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిష్పాక్షిక విచారణ జరిగేలా చూసేందుకు, సంబంధిత అధికారులతో మాట్లాడతానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సుదర్శన్ తో పాటు, డబ్ల్యూజేఐ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.

By NYALAKONDA ANIL DESAI | November 05, 2024 | 0 Comments

బండి సంజయ్ కుమార్ ను కలసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్.

బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్. ఇటీవల తనపై జరిగిన పాశవికదాడి గురించి కేంద్రమంత్రికి వివరించిన సుదర్శన్. ఈ కేసులో ఇల్లందు పోలీసులు అసలైన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, మరో ముగ్గురిని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చిన సుదర్శన్. ఈ విషయంలో సంబంధిత జిల్లా ఎస్పీతో మాట్లాడతానని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి. బాధిత జర్నలిస్టుకు భరోసా కల్పించిన మంత్రి. కార్యక్రమంలో డబ్ల్యూజేఐ నాయకులు న్యాలకొండ అనిల్ రావు,తాడూరు కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్, టి సత్యనారాయణ, దారం జగన్నాథరెడ్డి, ఆడపు లక్ష్మీనారాయణ, మొగురం రమేష్ తదితర జర్నలిస్టు లు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | November 05, 2024 | 0 Comments

రెస్టారెంట్ ఫుడ్ తో ప్రాణగండం జర జాగ్రత్త!!

రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు మంగళ వారం వివిధ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. కె సి ఆర్ కాలనీ కవిత థియేటర్ ప్రాంతంలో సాఫ్రాన్ మండి పేరుతో నిర్వహిస్తున్న ఒక రెస్టారెంట్ లో నిలువ ఉంచి నాణ్యతగా, పరిశుభ్రంగా లేని ఆహార పదార్థాలను గుర్తించారు. వాటిని ఉపయోగించకుండా ఫినాయిల్ పోసారు. నిర్వాహకుల నుండి ముప్పదివేల రూపాయలు జరిమానా గా వసూలు చేశారు. ఈ తనిఖీలలో హెల్త్ అసిస్టెంట్లు కిరణ్, వైకుంఠం, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | July 14, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1