మధ్య భారత మహారాణి అహల్యాబాయి హోల్కర్ 230వ వర్ధంతి ఆగస్టు 13న రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంద్దాం : పూలే బి సి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ తేదీ:12-8-2025 మంగళవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా గల సంఘం కార్యాలయంలో పత్రికా మిత్రులతో పూలే బి సి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ మాట్లాడుతూ మధ్యభారత మహారాణి అహల్యాబాయి హోల్కర్ 1725 మే 31న మహారాష్ట్రలోని అహ్మదాబాద్ జిల్లా, చండీ గ్రామంలో సాధారణ గొర్రెల కాపరి అయిన (దన్గర్) మంకోజి షిండే, సుశీల షిండే గార్లకు జన్మించినారన్నారు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే మల్హార్ ప్రాంత మహారాజు, మరాఠ సామ్రాజ్యం రాజు మల్హర్రావు హోల్కర్ పూణేకి వెళ్లే దారిలో ఒక శివాలయాన్ని సందర్శించినప్పుడు అహల్యబాయి 8 సంవత్సరాల బాలిక యొక్క భక్తి , వ్యక్తిత్వానికి ముగ్దుడై కోడలుగా ఆమెని ఎంచుకొని వారి తల్లి దండ్రులను ఒప్పించి 1733 లో వారి కుమారుడైన 10 సంవత్సరాల ఖండేబ హోల్కర్ కు ఇచ్చి ఘణంగా వివాహం జరిపించినారన్నారు. ఆమె వివాహ అనంతరం వారి అత్తగారైన గౌతమి హోల్కర్ సలహాలు, సూచనలతో రాజ నీతిలో, యుద్ధ విద్యలో వారి ప్రోత్సహంతో నేర్చుకుని స్వయంగా యుద్ధంలో పాల్గొన్న మహారాణి అహల్యబాయి అన్నారు. భర్త యుద్ధంలో, మామ వృద్ధాప్యంతో, కుమారుడు అనారోగ్యముతో ఒకరి తర్వాత ఒకరు మరణించడం జరిగిందన్నారు. కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉన్న , ఎన్నో కష్టాలను ఎదుర్కొని, రాజ్యంలోని ప్రజల బాగోగుల కోసం రాజ్యపాలన బాధ్యతలు చేపట్టి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని, నర్మదా నదిలో స్నానం ఆచరించి, మట్టితో శివ లింగం ఏర్పాటు చేసి శివ లింగం సాక్షిగా ప్రజాపాలన గావించిన మహారాణి అన్నారు. అహల్యా భాయి హోల్కర్ ఆమె తన 30 సంవత్సరాల పాలనలో, 70 సంవత్సరాల జీవితంలో కాశీ నుండి కన్యాకుమారి వరకు 108 శివ లింగాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా భారతదేశంలో 157 ఆలయాలను కాశీ నుండి కన్యాకుమారి వరకు ఆలయల పునఃరుద్ధరించి, విగ్రహ పుణః ప్రతిష్ట, గతంలో విదేశీయులచే దాడి చేయబడ్డ పురాతనమైన విగ్రహాల నిర్మాణం, రోడ్లు వేయడం, సత్రాల నిర్మాణం చేసిన మహనీయులన్నారు. దాన, ధర్మాలతో వారసత్వముగా వచ్చిన తమ ఆస్తులను ఖర్చుచేస్తూ ఆనాటి ప్రజల ఆదరణ పొంది ఒక దైవం పంపిన దూతగా భావించి ప్రజల పూజలందుకున్న మహా రాణి అన్నారు. ప్రస్తుతం విశ్వ విద్యాలయాలకు, జాతీయ రహదారులకు, ఇండోర్ విమానాశ్రయాకి వారి పేరు పెట్టడం జరిగినదన్నారు. కావున వారి 230వ వర్ధంతి (13-8-1795) రాష్ట్ర వ్యాప్తంగా 13-8-2025 బుదవారము రోజున జరుపుకొంద్దామని , వారి జీవిత చరిత్రను నేటి తరానికి, విద్యార్థులకు, ప్రజలకు తెలియజేస్తూ అలాగే వారి జీవిత చరిత్ర ను పాఠ్య పుస్తకాల్లో చేర్పించాలని కోరుచున్నామన్నారు.