రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9వ తేదీ లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జె. అరుణ శ్రీ సూచించారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి 10వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ముసాయిదా జాబితా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు.

Comments 0