యోగా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణను అందించే గొప్ప జీవన విధానమని పెద్దపెల్లి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ నాగండ్ల అన్నారు. జిల్లాలోని యోగా ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చి విద్యార్థులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే అసోసియేషన్ లక్ష్యమని తెలిపారు.