భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలిగా వడ్డేపల్లి (చిలుక) భారతి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఈ నియామకం చేశారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, మహిళా మోర్చా బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments 0