మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు. మంథని గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించి, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Comments 0