గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో గురువారం రాత్రి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్షిఫ్ మేజిస్ట్రేట్లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి, రామగిరి స్వారీక ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని వారు పేర్కొన్నారు. అనంతరం మహిళా న్యాయవాదులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, కార్యదర్శి సంజయ్ కుమార్‌తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.