రామగుండం లోక్‌ కల్యాణ్‌ మేళా‌లో భాగంగా శుక్రవారం మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు పోస్ట్‌ ఆఫీస్‌ క్యూ ఆర్‌ కోడ్‌ స్కానర్లు అందజేశారు. అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌ (ఎఫ్‌ఏసీ) జె. అరుణశ్రీ మాట్లాడుతూ పోస్ట్‌ ఆఫీస్‌ ఖాతాల ద్వారా డిజిటల్‌ లావాదేవీలతో క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు పొందవచ్చన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం పోస్ట్‌ ఆఫీస్‌ ఖాతాలు ఉపయోగపడతాయని తెలిపారు.