రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం రోజున రాయికల్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద శివాజీ సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని తన రాజ్యంలోని ఆడవాళ్ల అందరిని మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ గోనె కాపు సంఘ కోశాధికారి కడపటి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సంఘ సభ్యులు జలపతి రెడ్డి, భూమారెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, ఎద్దండి రాజు రెడ్డి, రంజిత్, మహిపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.