రాయికల్ మండలం అయోధ్య గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల ఆధార్ నమోదు, అప్డేట్ కొరకు ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆధార్ నమోదు కేంద్రం సూపర్వైజర్ గంట్యాల ప్రవీణ్ మాట్లాడుతూ 5- 7 సంవత్సరాల పిల్లలకు ఆధార్ అప్డేట్ కు ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. 7 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు సాధారణ రుసుముతో అప్డేట్ అదేవిధంగా గ్రామ ప్రజలు బయోమెట్రిక్ అప్డేట్, ఫోన్ నెంబర్,చిరునామా, పుట్టిన తేదీలో మార్పులు సాధారణ రుసుముతో చేయబడును అని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో అయోధ్య మాజీ గ్రామ సర్పంచ్ జీవన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్, ఉపాధ్యాయులు రాజ్ మహమ్మద్, శ్రీనివాస్ ఇతర ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గంగజల, గ్రామ కారోబార్ రాజేందర్ మరియు పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
Comments 0