రాయికల్ మున్సిపాలిటీలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.మున్సిపల్ చైర్మన్ పీఠానికి ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు.చేయగా భాజపా నుంచి కల్లెడ ధర్మపురి ని కునరపు మానస ప్రతిపాదించగా తోపరపు ప్రశాంతి బలపరిచారు.బారాస నుండి తురగ సౌజన్య కట్కం రవీందర్ ను చైర్మన్ గా ప్రతిపాదన చేయగా ఎలిగేటి లతిక బల పరిచారు.కాంగ్రెస్,బారాస సభ్యుల తో పాటు స్వాతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో బారాస పార్టీ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు.రాయికల్ పురపాలిక చైర్మన్ గా కట్కం రవీందర్,వైస్ చైర్ పర్సన్ గా తురగ సౌజన్య ఎన్నికయ్యారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ కట్కం రవీందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పురపాలక చైర్మెన్ గా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.రాయికల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.వైస్ చైర్ పర్సన్ తురగ సౌజన్య మాట్లాడుతూ రాయికల్ పట్టణ అభివృద్ధికి అందరితో సమన్వయంగా పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి తోడ్పడుతానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పురపాలిక సిబ్బంది పాల్గొన్నారు.
.jpeg)

Comments 0