|
modi add 1

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ముందుగా "రక్షాబంధన్ వేడుకలు"

రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం ముందస్తు రక్ష బంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చిన్నారులు వివిధ రకాలైన వృత్తుల వేషధారణలో వచ్చి అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ జే వేణుగోపాల్ రావు మాట్లాడుతూ రక్షాబంధన్ అంటే సోదరి సోదరుల అనుబంధమే కాకుండా ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలని విద్యార్థులకు సూచించారు. రక్షా బంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది సోదర ప్రేమ, రక్షణ మరియు బాధ్యతలను గుర్తుచేసే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా, మనం మన కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవాలి, అలాగే సమాజంలో సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. మనదేశంలో ఇంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారంటే దానికి నిరంతరం శ్రమించే కొన్ని వృత్తులు వారి త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి దేశ రక్షణకై సమాజ సేవకై పాటుపడాలని వివరిస్తూ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి విద్యార్థి తన ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని ప్రిన్సిపల్ వేణుగోపాల్ రావు విద్యార్థులకు సూచించారు తదనంతరం తరగతి విద్యార్థులు అందరూ ఒకరికి ఒకరు రాఖీ కట్టుకొని "నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష "అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గారు జే తిరుపతి రావు గారు, ప్రిన్సిపల్ జె వేణుగోపాల్ రావు ,ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 07, 2025 | 0 Comments

భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం "చేనేత" కళ...!

భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచింది "చేనేత" కళ అని రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. మనిషికి నాగరికతను అద్దింది నేత కార్మికులని పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.ప్రాచీన కాలం నుంచే మన దేశంలో మగ్గాల ద్వారా చేనేత ఉత్పత్తి జరిగిందని మొదట్లో ఈ విధానంతో వస్త్ర ఉత్పత్తికి చాలా సమయం పట్టేదన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన జాన్ కే 1733 లో ఫ్లై షటిల్ ను కనిపెట్టాక మగ్గం ద్వారా వస్త్రాల ఉత్పత్తి సామర్థ్యం బాగా పెరిగింది అన్నారు.1801 లో జోసెఫ్ ఎం జాకార్డ్ పెద్ద డిజైన్లు రూపొందించే పరికరాన్ని తయారు చేయగా ప్రస్తుతం చేనేత రంగంలో ఉపయోగిస్తున్నారని ఆ పరికరాన్ని జాకార్డ్ గా పిలువ పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్,కోశాధికారి ఆడెపు నర్సయ్య,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి గంట్యాల ప్రవీణ్,మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,మ్యాకల కాంతారావు,గాజంగి అశోక్,బొమ్మ కంటి గోపాల్, సభ్యులు మచ్చ నారాయణ,మామిడాల లక్ష్మీనారాయణ,వాసం స్వామి,దాసరి గంగాధర్,దిలీప్,లక్ష్మీనారాయణ,ప్రభాకర్,గంగన్న,మధు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 07, 2025 | 0 Comments

రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

రాయికల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించి సుమారు 50 మంది బాలింతలకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ లయన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ బిడ్డకు సరిపడా పాలు ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడే తల్లి పౌష్టికాహారం తీసుకోవాలని. ప్రోటీన్లు ఉండే పాలు, చేపలు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని. దీనివల్ల బిడ్డకు సరిపడా పాలు పుష్కలంగా లభిస్తాయని,తల్లికి కలిగే ప్రయోజనాలు బిడ్డకు ముర్రుపాలు పట్టడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో రొమ్ము, అండాశయ క్యాన్స ర్లు, మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుం ది. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు. గర్భదారణకు పూర్వం ఉండే బరువును మళ్లీ పొందవచ్చు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువల ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో డయాబెటిక్ డిస్టిక్ కోఆర్డినేటర్ బత్తిని భూమయ్య, రాయికల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి , వాసం ప్రసాద్, వెంకట్ రెడ్డి, ప్రసాద్ ,సుధవేణి మురళి ,సాంబారు శ్రీనివాస్ ,మరియు డాక్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు,

By Gantyala Praveen | August 05, 2025 | 0 Comments

జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తా.ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్.

జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు నూతన జిల్లా కార్యవర్గానికి ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చీటి శ్రీనివాస్ మాట్లాడుతూ, "జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం,ఆరోగ్య కార్డులు,బీమా వంటివి అందించేందుకు కృషి చేస్తాను. జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిలా పనిచేస్తున్నారు. కానీ వారి సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావడం లేదు. వాటిని అధికారులకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను," అని అన్నారు. రాయికల్‌కి చెందిన జర్నలిస్టులు ఐక్యతతో ఉన్నందుకు అభినందించిన ఆయన, ఇతర ప్రాంతాల్లో కూడా ఇది ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, అల్లె రాము, సంయుక్త కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి, ఇందూరి నరేష్, బూరం లక్ష్మణ్, పెరంబుదూరు శ్రీకాంత్, రాయికల్ ప్రెస్ జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ ఏ.ఎం. రాజు రెడ్డి, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్, సీనియర్ పాత్రికేయులు సింగిడి శంకర్, ముజాఫర్, బొంగోని శ్రీనివాస్, సింగని శ్యాంసుందర్, వాసం లింబాద్రి,గంట్యాల ప్రవీణ్, ఇమ్మడి విజయ్, తీగల గోపి, శ్రీను, వెంకటేష్, కిరణ్ రావు, నరేష్, శంకర్, షాకీర్, రమాపతిరావు, గంగాధర్, భీమరాజు, కళ్యాణ్, రషీద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 05, 2025 | 0 Comments

రాష్ట్ర అథ్లెటిక్స్‌కు అల్లీపూర్ విద్యార్థిని

మెట్ పల్లి లో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అల్లీపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న టి.అనూష షాట్‌పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి ఆగస్టు 3,4 తేదీలలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, పి. డి.కృష్ణ ప్రసాద్ తెలిపారు . ఎంపికైన విద్యార్థినిని ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు అభినందించారు.

By Gantyala Praveen | July 30, 2025 | 0 Comments

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

రాయికల్ మండల కేంద్రంలోని ప్రణుతి జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల పైన, బెట్టింగ్ యాప్స్, మొబైల్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ మాయలో పడకుండా ఉండాలి. మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో సేవించరాదు. బెట్టింగ్ యాప్స్ కి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి అని మరియు మన భారతదేశం ను డ్రగ్స్ లేని సమాజంగా మనమంతా కలిసి నిర్మిద్దాం. మీ దృష్టికి మత్తు పదార్థాలను స్వీకరిస్తున్నట్టు ఎవరైనా కనిపిస్తే వెంటనే మీ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి లేదంటే డయల్ తెలంగాణ పోలీస్ 112 కాల్ చేసి సమాచారాన్ని తెలపండి. అలాగే మిలటరీ జాబ్స్ కి తెలంగాణ స్టేట్ పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మా సైనిక గ్రూప్ అండగా ఉంటుంది అని జగిత్యాల ఇంచార్జ్ పంచతి బాలరాజు తెలిపారు.ఈ సదస్సును పురస్కరించుకొని ఇటీవలే ఆర్మీ నుండి రిటైర్డ్ అయిన మాజీ సైనిక అధికారి భూపతిపూర్ గ్రామానికి చెందిన నూకల మల్లేశం గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి, మాజీ సైనిక అధికారి నూకల మల్లేష్, పోలీస్ కానిస్టేబుల్ మనోజ్, శ్రీ నేతాజీ యూత్ అధ్యక్షులు అస్లాం,నరేష్, మధు, రాజేందర్, వేణుగోపాల్, కే.శేఖర్, రాజశేఖర్, వినయ్, లెక్చరర్ బృందం పాల్గొన్నారు.

By Gantyala Praveen | July 30, 2025 | 0 Comments

అయోధ్య గ్రామంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు

రాయికల్ మండలం అయోధ్య గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల ఆధార్ నమోదు, అప్డేట్ కొరకు ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆధార్ నమోదు కేంద్రం సూపర్వైజర్ గంట్యాల ప్రవీణ్ మాట్లాడుతూ 5- 7 సంవత్సరాల పిల్లలకు ఆధార్ అప్డేట్ కు ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. 7 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు సాధారణ రుసుముతో అప్డేట్ అదేవిధంగా గ్రామ ప్రజలు బయోమెట్రిక్ అప్డేట్, ఫోన్ నెంబర్,చిరునామా, పుట్టిన తేదీలో మార్పులు సాధారణ రుసుముతో చేయబడును అని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో అయోధ్య మాజీ గ్రామ సర్పంచ్ జీవన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్, ఉపాధ్యాయులు రాజ్ మహమ్మద్, శ్రీనివాస్ ఇతర ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గంగజల, గ్రామ కారోబార్ రాజేందర్ మరియు పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | July 30, 2025 | 0 Comments

కోతుల బెడదతో బెంబేలెత్తుతున్న జనం..

రాయికల్ పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని కేశవ నగర్, మత్తడి వాడలో అధిక సంఖ్యలో కోతులు సంచరిస్తూ, ఇంటి తలుపులు తెరుచుంటే చాలు లోనికి ప్రవేశించి, నిత్యవసర సరుకులు,పప్పులు, కూరగాయలు, తీసుకు వెళ్లడమే కాకుండా పిల్లలు,వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. చివరికి ఇండ్లలో చొరబడి అన్నం, కూరలు తింటున్నాయని అడ్డుకొ పోయిన ఇంటి యజమానుల మీద దాడులు చేస్తున్నాయని, కోతుల విధ్వంసం దాడుల నుంచి ప్రజలు ఇంటి తలుపులు మూసి వేసుకొని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఈ విషయమై మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి,వినతి పత్రాలు అందించిన స్పందించడం లేదంటు పలువురు కాలనీవాసులు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి కోతుల బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

By Gantyala Praveen | July 29, 2025 | 0 Comments

గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు అన్నారు. రాయికల్ మండలం సింగరావుపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్ బాయ్స్ హై స్కూల్ లో ఉపాధ్యాయ సమస్యలు తెలుసుకొని,మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమావేశం లో అయన మాట్లాడుతూ గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. హెల్త్ స్కీమ్ వర్తించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. గురుకుల పాఠశాల పని వేళల మార్పునకు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశారని,త్వరలోనే ఉత్తర్వులు వస్తాయాన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తించే విధంగా పిఆర్టియు టిఎస్ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పొన్నం రమేష్, బొమ్మకంటి రవి కుమార్, రాష్ట్ర కార్యదర్శి జాదవ్ వసంత రావు, మండల అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య లు పాల్గొన్నారు.

By Gantyala Praveen | July 29, 2025 | 0 Comments

జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు కోసం ఎమ్మార్వో కు ఏ డబ్ల్యూజే ఏ వినతి

జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం ఎమ్మార్వో నాగార్జున కు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏ డబ్ల్యూ జే ఏ) రాయికల్ మండల శాఖ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాయికల్ పట్టణములో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని, లబ్దిదారుల ఎంపిక కూడ జరుగలేదని అన్నారు. గత అనేక సంవత్సరాల నుండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి అనేక సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్న జర్నలిస్ట్ లకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన స్థలం మరియు దాని పరిసరాలలో ఉన్న రెండు ఎకరాల విస్తీర్ణం గల భూమిని జర్నలిస్ట్ కాలనీ కి కేటాయించాలని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు గా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అసంపూర్తి నిర్మాణ సముదాయాన్ని పూర్తీ చేసి సీనియారిటీ ప్రతిపదికన మరియు అర్హత ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇండ్లను జర్నలిస్టులకు మంజూరు చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కడుకుంట్ల జగదీశ్వర్, జిల్లాఅధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ రసూల్,చింతకుంట సాయికుమార్ మండల అధ్యక్షుడు ఇమ్మడి విజయ్ కుమార్, మరియు పాత్రికేయులు సిర్ప సంతోష్, గంట్యాల ప్రవీణ్,యాచమనేని కిరణ్ రావు, మహమ్మద్ షాకిర్, పడాల రమేష్, దుగ్గ్యాల రామపతి రావు, మాలావత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | July 29, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1