గోదావరిఖని చౌరస్తా ప్రాంతంలో మల్లేశం దీక్షకు సంఘీభావంగా దళిత సంఘాల నాయకులు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పట్టాలపై నివసిస్తున్న నిరుపేద దళిత, బహుజన కుటుంబాల ఇండ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయడం అన్యాయమన్నారు. కూల్చివేతకు గురైన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Comments 0