గోదావరిఖని చౌరస్తాలో సావిత్రిబాయి పూలే జయంతిని దళిత, బీసీ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు చిలుక ప్రసాద్, కనుకుంట్ల రమేష్ మాట్లాడుతూ మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే గారు చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కోరే శంకర్, శశికుమార్, సర్వేష్, మారముల మల్లయ్య, మాసవత్తుల పోషం, అశోక్ సాగర్, అంబటి సతీష్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments 0