గోదావరిఖని: ప్రజల రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో గోదావరిఖని నుంచి కాకినాడకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ బుధవారం ప్రారంభించారు. బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గోదావరిఖని మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కాకినాడ ప్రయాణానికి ఈ కొత్త బస్సు సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. కొత్త బస్సు సేవ ప్రారంభంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.