రాయికల్ పట్టణానికి చెందిన కోచ్ కనుక ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని బాలుర ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం ఉదయం 6 గంటలకు కుంఫుడో , మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులచే అన్ని రకాల యోగాసనాలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి రోజూ యోగా చేయడం వల్ల శరీరం, మనస్సు మరియు ఆలోచనా విధానంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడమే కాక, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుందని తెలియజేశారు.

Comments 0