రామగుండం, అక్టోబర్ 2 (జనంగొంతు): రామగుండం కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిట్యాల వెంకటేష్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్, మేయర్ మహంకాళి స్వామి వెంకటేష్‌ను శాలువాతో సత్కరించి, స్వీట్లు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


Comments 0