పెద్దపల్లి జిల్లా డిజిటల్ ఈ-పేపర్ & యూట్యూబ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా జాయింట్ సెక్రటరీగా జనం గొంతు తెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్ అంబటి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రమేష్ నియామక పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఫోరం తరఫున కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. జర్నలిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని అంబటి సతీష్ కుమార్ తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు, పాత్రికేయ మిత్రులు అభినందనలు తెలియజేశారు.




Comments 0