పిఆర్టియుటిఎస్‌ పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గండు కృష్ణమూర్తి, కానుగంటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. రంగంపల్లిలోని ఆర్‌.ఆర్‌. గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నాలుగు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అధ్యక్షుడిగా గండు కృష్ణమూర్తి 55 ఓట్లతో, ప్రధాన కార్యదర్శిగా కానుగంటి శ్రీనివాస్ 49 ఓట్లతో విజయం సాధించారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు 20 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల పరిశీలకులుగా జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్‌నాథ్ రెడ్డి, ఆనంద్ రావు వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.