తెలంగాణ చేనేత :వ్యవసాయమార్కెంటింగ్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారిని కలసి చేనేత కార్మికులకోసం ముఖ్యం గా ఆర్థికంగా వెనుక బడ్డ పద్మశాలి లఆర్టికలబ్ది పై పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తూ గత20ఏళ్ళు గా పద్మశాలి కులం అభివృద్ధి పై అవినీతి రాజకీయ ల పై అవినీతి నేత ల పై చట్టం ద్వారా న్యాయం ద్వారా పోరాటం చేస్తున్న నాకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తూ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి మా చేనేత ల కి చేయూతఅందించాలని బెల్లంపల్లి ల్లో ఆప్కో షాప్ ఎత్తియడం లో ప్రధాన పాత్ర పోషించిన నేత లపై చర్య తీసుకోని చేనేత వస్త్రాలయం పై మంచి ర్యాల జిల్లా కలెక్టర్ గారికి ప్రజా వాణి లో ఇచ్చిన విజ్ఞప్తి పై మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారు వెంటనే చర్య తీసుకోని చేనేత లకి చేయూత ఇస్తూ ప్రతి నియోజకవర్గం కేంద్రం లో పద్మావతి కాలనీ పేరున ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చెయ్యాలి అని మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారినిశాలువా తొ. సన్మానం చేసి విజ్ఞప్తి చేసిన అఖిల భారత పద్మశాలి సంఘము జాతీయ ప్రతినీది కొలిపాక శ్రీనివాస్ హైదరాబాద్ ఒక ప్రకటన ద్వారా తెలియచేశార
జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం ఎమ్మార్వో నాగార్జున కు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏ డబ్ల్యూ జే ఏ) రాయికల్ మండల శాఖ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాయికల్ పట్టణములో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని, లబ్దిదారుల ఎంపిక కూడ జరుగలేదని అన్నారు. గత అనేక సంవత్సరాల నుండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి అనేక సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్న జర్నలిస్ట్ లకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన స్థలం మరియు దాని పరిసరాలలో ఉన్న రెండు ఎకరాల విస్తీర్ణం గల భూమిని జర్నలిస్ట్ కాలనీ కి కేటాయించాలని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు గా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అసంపూర్తి నిర్మాణ సముదాయాన్ని పూర్తీ చేసి సీనియారిటీ ప్రతిపదికన మరియు అర్హత ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇండ్లను జర్నలిస్టులకు మంజూరు చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కడుకుంట్ల జగదీశ్వర్, జిల్లాఅధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ రసూల్,చింతకుంట సాయికుమార్ మండల అధ్యక్షుడు ఇమ్మడి విజయ్ కుమార్, మరియు పాత్రికేయులు సిర్ప సంతోష్, గంట్యాల ప్రవీణ్,యాచమనేని కిరణ్ రావు, మహమ్మద్ షాకిర్, పడాల రమేష్, దుగ్గ్యాల రామపతి రావు, మాలావత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.