|
modi add 1

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన విద్యార్థినిని అభినందించిన పాఠశాల యాజమాన్యం

గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని నరేంద్ర విద్యాలయం హై స్కూల్ లో ఇదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి సిరిపురం జగదీశ్ జెటివో గా ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు పాఠశాల యాజమాన్యం గంగాధర రాజేశం గోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కారం చేశారు. 10 సంవత్సరాలు పాఠశాల లో చదివి ఉన్నత చదువులలో రాణించి ప్రభుత్వ ఉద్యోగం పొందడం పాఠశాలకు గర్వ కారణమన్నారు. చిన్నప్పటి నుండి చదువులో మంచి ప్రతిభ కనబరిచే వాడాన్నారు. మంచి విద్యార్థిగా ఎదిగినప్పుడు సమాజం లో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి జెటివో గా బాధ్యతలు తీసుకొని ఇతర జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

By NYALAKONDA ANIL DESAI | March 28, 2026 | 0 Comments

Hot Categories

2
7
1