|
modi add 1

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో ద్వితీయ బహుమతి సాధించిన కడకుంట్ల అభయ్ రాజ్

రాయికల్ మండలంలోని కుమ్మరిపెల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సంగారెడ్డి జిల్లాలోని గాడియం పాఠశాలలో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో ద్వితీయ బహుమతి సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మండల విద్యాధికారి రాఘవులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గుమ్మడి సంతోష్, ఉప సర్పంచ్ కొడిమ్యాల శేఖర్, ప్రధానోపాధ్యాయులు దేవలక్ష్మి తదితరులు అభినందించారు.

By Gantyala Praveen | January 24, 2026 | 0 Comments

Hot Categories

2
8