|
modi add 1

అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి అద్భుత ప్రతిభ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పతకాల పంట

అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి అద్భుత ప్రతిభ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పతకాల పంట జాతీయ స్థాయిలో కరీంనగర్ పోలీస్ కీర్తిని చాటిన హుజురాబాద్ ఏసీపీ మాధవి. కరీంనగర్, మే 15, 2026: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఈనెల 9వ తేదీ నుండి 13వ తేదీ (09.05.2026 నుండి 13.05.2026) వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "అఖిల భారత పోలీస్ క్రీడా పోటీల" (All India Police Games) లో కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ ఏసీపీ (ACP) వి. మాధవి గారు అద్భుత ప్రదర్శనతో రాణించి ఘన విజయం సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన గట్టి పోటీని తట్టుకొని, టేబుల్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ విభాగాల్లో ఆమె ఏకంగా నాలుగు పతకాలను కైవసం చేసుకుని రాష్ట్ర పోలీస్ శాఖకు, కరీంనగర్ కమిషనరేట్‌కు తీరని కీర్తిని తెచ్చిపెట్టారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి సాధించిన పతకాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: టేబుల్ టెన్నిస్ (Table Tennis) విభాగం: జి.ఓ. 50+ (G.O. 50+) విభాగం: మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచి రజత పతకం (Silver Medal) సాధించారు. జి.ఓ. 40+ (G.O. 40+) విభాగం: మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో గట్టి పోటీనిచ్చి కాంస్య పతకం (Bronze Medal) కైవసం చేసుకున్నారు. ఎన్.జి.ఓ. (N.G.O.) విభాగం: మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రాణించి కాంస్య పతకం (Bronze Medal) సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ (Badminton) విభాగం: జి.ఓ. 50+ (G.O. 50+) విభాగం: మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో అద్భుత ఆటతీరుతో కాంస్య పతకం (Bronze Medal) సాధించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఘన అభినందనలు: జాతీయ స్థాయిలో ఒకే క్రీడా పోటీలలో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి భిన్నమైన విభాగాల్లో నాలుగు పతకాలు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించిన హుజూరాబాద్ ఏసీపీ మాధవి పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మరియు సహచర అధికారులు ఘనంగా అభినందించారు. విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉంటూనే, క్రీడల పట్ల మక్కువతో కఠోర శ్రమకోర్చి జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

By NYALAKONDA ANIL DESAI | May 16, 2026 | 0 Comments

Hot Categories

2
7
1