రాయికల్: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాయికల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ వాసం ప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్విరాన్మెంట్ వీక్ సందర్భంగా లయన్స్ క్లబ్ రాయికల్ ఆధ్వర్యంలో పట్టణంలోని హోటల్ యజమానులకు 100 స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. ఒక్కసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ గ్లాసులకు ప్రత్యామ్నాయంగా స్టీల్ గ్లాసులను వినియోగించేలా హోటల్ యజమానులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వాసం ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోటళ్లు, టీ స్టాళ్లలో వినియోగించే ప్లాస్టిక్ గ్లాసుల కారణంగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు. వీటి స్థానంలో స్టీల్ గ్లాసులను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. మనం నేడు తీసుకునే చిన్న నిర్ణయాలే రేపటి తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తాయని తెలిపారు. హోటల్ యజమానులు తమ వ్యాపార కార్యకలాపాల్లో పర్యావరణహిత విధానాలను అనుసరించాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో వ్యాపారులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. స్టీల్ గ్లాసులను వినియోగించడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ కనపర్తి శ్రీనివాస్, ట్రెజరర్ లయన్ సుధావేణి మురళి గౌడ్, బత్తిని భూమయ్య, దాసరి గంగాధర్, మచ్చ శేఖర్, వాసం స్వామి, కౌన్సిలర్ పల్లికొండ గంగాధర్, సంకోజి అశోక్, సామల సత్యనారాయణ, ఆడెపు రాంప్రసాద్, పారిపెల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.