|
modi add 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి 7 రోజుల జైలు- 15 మందికి రూ.41,500 జరిమానా.. ప్రభుత్వ ఆసుపత్రిలో కమ్యూనిటీ సర్వీస్

రామగుండం: మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై రామగుండం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 16 మందిని గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వెంకట సచిన్ రెడ్డి ఎదుట హాజరుపరిచారు. వారిలో 15 మందికి మొత్తం రూ.41,500 జరిమానా విధించడంతో పాటు, కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు చేయించారు. మరో వ్యక్తికి న్యాయస్థానం 7 రోజుల జైలు శిక్ష విధించడంతో అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు అన్ని ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

By Ambati Sathish kumar | September 05, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1