గోదావరిఖని: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అమ్మకు అక్షర మాల” కార్యక్రమంలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్‌లో మహిళలకు వ్రాత పరీక్ష నిర్వహించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో మెప్మా CO శమంత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 43వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ హాజరై మహిళలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించడంతో పాటు, వారికి విద్యపై ఆసక్తి కల్పించడమే “అమ్మకు అక్షర మాల” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మెప్మా CO శమంత, RP విజయ, తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఉత్సాహంగా వ్రాత పరీక్షలో పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.