|
modi add 1

దొరల దౌర్జన్యాన్ని ఎదిరించిన ధీరవనిత.. చాకలి ఐలమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 131వ జయంతి వేడుకలు

రాయికల్, సెప్టెంబర్ 26: తెలంగాణ నేల పోరాట పటిమకు, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతిని రాయికల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ సాహసోపేత పోరాటాన్ని వారు స్మరించుకున్నారు. భూస్వామ్య దోపిడీ, దొరల పెత్తనం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా నిలిచి.. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. నిజాం పాలన కాలంలో రజాకార్ల దౌర్జన్యాలు, భూస్వాముల పెత్తనాన్ని ఎదుర్కొంటూ సామాన్య ప్రజల్లో ధైర్యాన్ని నింపిన ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, హక్కుల కోసం పోరాడే సంకల్పం ఆమె జీవితం ద్వారా స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఆత్మగౌరవ పోరాటానికి చిరస్మరణీయ ప్రతీక చాకలి ఐలమ్మ పోరాటం ఒక వ్యక్తి పోరాటంగా కాకుండా, అణచివేతకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం నిలబడిన చారిత్రక ఉద్యమంలో భాగంగా గుర్తించబడిందని వక్తలు పేర్కొన్నారు. ఆమె ధైర్యం, తెగువ, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు ధరి, గంగాధర్, రమేష్, నాగరాజు, వెంకటేష్, రమేష్, సాయిలు, రాజు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు.

By Gantyala Praveen | September 26, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1