రామగుండం, అక్టోబర్ 1: రామగుండం మండల టీచర్ యూనియన్ (PRTUTS) నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను జిల్లా అధ్యక్షులు గండు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్తో పాటు సీనియర్ నాయకులు పర్యవేక్షించారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పెరటి రవీందర్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా బి. సత్యనారాయణ, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా వి. సంగీత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి. ఫ్రాన్సిస్, బి. లక్ష్మణ, మహిళా ఉపాధ్యక్షులుగా బి. స్వప్న, బి. లలిత బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యదర్శులుగా డి. రాజిరెడ్డి, బి. సుభాష్, మహిళా కార్యదర్శులుగా ఎన్. రాణి, ఐ. రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.