|
modi add 1

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఎఐటియుసి (AITUC)సంపూర్ణ మద్దతు

పెద్దపల్లి: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న దేశవ్యాప్త మూడు రోజుల సమ్మెకు ఎఐటియుసి పెద్దపల్లి జిల్లా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని, బ్యాంకుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి సిబ్బంది కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. అధిక పనిభారం, లక్ష్యాల ఒత్తిడిని తగ్గించి ఉద్యోగుల పని–జీవిత సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికవర్గం బ్యాంకు ఉద్యోగులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

By Ambati Sathish kumar | September 27, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1