గోదావరిఖని, సెప్టెంబర్ 27: పెద్దపల్లి జిల్లా బీజేపీ లేబర్ సెల్ విభాగం కో-కన్వీనర్‌గా గోదావరిఖనికి చెందిన ఎల్తూరి రాజయ్య నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి సూచనల మేరకు జిల్లా లేబర్ సెల్ కన్వీనర్ తడగొండ నర్సయ్య రాజయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థవంతమైన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు, అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేపట్టి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఎల్తూరి రాజయ్య మాట్లాడుతూ, తనను బీజేపీ లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్‌గా నియమించినందుకు జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి, బీజేపీ లేబర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్, జిల్లా లేబర్ సెల్ కన్వీనర్ తడగొండ నర్సయ్యలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్మికుల సంక్షేమం, పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.