|
modi add 1

కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి.. పద్మావతి కాలనీలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

గోదావరిఖని 49వ డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మావతి కాలనీ డెవలప్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్పొరేటర్ సాగి సంతోష్‌రావు, నడిపెల్లి మురళీధర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ నాగండ్ల మాట్లాడుతూ “మన కాలనీ.. మన కుటుంబం” అనే భావనతో కాలనీవాసులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | September 04, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1