|
modi add 1

కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసిన వారాహి ఎనర్జీస్ మేనేజర్ బూడిద సతీష్

పెద్దపల్లి, అక్టోబర్ 1: పెద్దపల్లి డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన సేవా సేతు క్యాంపులో TGNPDCL డిస్కం ఆధ్వర్యంలో సోలార్ వెండర్లతో కలిసి ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను వారాహి ఎనర్జీస్ మేనేజ్‌మెంట్ మేనేజర్ బూడిద సతీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. పథకం ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, సోలార్ విద్యుత్ వినియోగం, ప్రజల్లో అవగాహన కోసం వారాహి ఎనర్జీస్ చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. ప్రజలు సోలార్ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. కార్యక్రమంలో వారాహి ఎనర్జీస్ సేల్స్ మేనేజర్లు బడికెల సతీష్, కొండ వెంకటేష్, దాడి అనిల్ పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | October 01, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1