సింగరేణి ఏరియా పరిధిలో నివసిస్తున్న గంగపుత్ర కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం గోదావరి తీరంలో సందడిగా, ఆత్మీయ వాతావరణంలో జరిగింది. గోదావరిఖని సమీపంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద నిర్వహించిన ఈ సమ్మేళనానికి గంగపుత్ర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి పరిచయాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న గంగపుత్ర కుటుంబాల మధ్య పరస్పర పరిచయాలు, ఐక్యత, సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై విస్తృతంగా చర్చించారు. యువత అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి విద్య, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు మార్గదర్శకత్వం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై పాల్గొన్న వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు సమాజంలోని విద్యావంతులు, ఉద్యోగులు, పెద్దలు కలిసి పనిచేయాలని పలువురు సూచించారు. ఐక్యతతోనే అభివృద్ధి ఈ సందర్భంగా సీనియర్ గంగపుత్ర నాయకుడు బంగారి రాజయ్య మాట్లాడుతూ.. సింగరేణి ఏరియా పరిధిలో నివసిస్తున్న గంగపుత్ర కుటుంబాల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగాలు, సామాజిక రంగాల్లో యువతకు అండగా నిలిచి, వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి కుటుంబం పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బంగారి రాజయ్య, పూస వసంత్ కుమార్, అంబటి శ్రీనివాసులు, బంగారి సారంగపాణి, పారుపల్లి రాజలింగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గంగపుత్ర విద్యావంతుల వేదిక సమన్వయం చేసింది. కుటుంబ సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడంతో గోదావరి తీరం ఆత్మీయతకు వేదికగా మారింది. పరస్పర పరిచయాలు, ఆత్మీయ పలకరింపులు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చలతో సమ్మేళనం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.