రాయికల్: ఎస్‌జీటీయూ రాయికల్ మండల శాఖ ఆధ్వర్యంలో 12 మంది ఉత్తమ ఎస్‌జీటీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంఈవో శ్రీపతి రాఘవులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల సేవలు అత్యంత విలువైనవని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ద్వారా ఇతర ఉపాధ్యాయుల్లోనూ మరింత స్ఫూర్తి, ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీటీయూ రాయికల్ మండల శాఖ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Comments 0