విద్యార్థులు,యువత ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని అలాంటి విద్యను ప్రణాళికతో చదివితే ఫలితాలు సాధించవచ్చని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు.గురువారం రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి అభ్యసించిన విద్యార్థులు తాలూకా శ్రీరామ్, గుమ్మడి అక్షర ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించగా గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులను సాల్వ,మెమొంటో తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఆ దిశగా ఇప్పటి నుండే కృషి చేయాలని సూచించారు.తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వృధా చేయకుండా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వారికి ఇష్టం ఉన్న రంగాన్ని ప్రోత్సహించి విజయం సాధించేలా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలని సూచించారు.ఉత్తమ మార్కులు,బాసర త్రిబుల్ ఐటీ లో సీట్లు వచ్చేలా విద్య బోధన చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.ఈ సందర్భంగా అభినందించార.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చార్టెడ్ ప్రెసిడెంట్ మోర హన్మాండ్లు,లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్,కోశాధికారి సుధవేణి మురళి,క్లబ్ సభ్యులు మ్యాకల రమేష్,మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,ఆడెపు రాం ప్రసాద్,పులి రమేష్, సాంబారు శ్రీనివాస్,కౌన్సిలర్ పుర్రె శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు పొన్నం రమేష్,రవీందర్,మల్లేశం,నాగరాజు,పద్మజ, తిరుమల,గంగాధర్, సత్యనారాయణ,శివానందం,యాస్మిన్ ఫాతిమా,శ్రీకాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.