తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు. బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశికాంత్ రెడ్డి,డాక్టర్ రజిత,డాక్టర్ సృజన,డాక్టర్ శ్రీకాంత్,డాక్టర్ అనిల్,డాక్టర్ అఖిల,డాక్టర్ ఉదయ్ కుమార్,శ్వేత లను సాల్వాల,మెమోటోలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ,అమూల్యమైన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.అనంతరం నూతన లయన్స్ క్లబ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా జెండా ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. పట్టణంలోని ఇటిక్యాల్ క్రాసింగ్ వద్ద ఉదయం డయాబెటిక్ క్యాంపు,నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే,చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా రాయికల్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగస్తులను,చార్టెడ్ అకౌంటెంట్లను సాల్వాల,మెమెంటో తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్,కోశాధికారి సుధవేణి మురళి, చార్టెడ్ ప్రెసిడెంట్ మోర హన్మాండ్లు,క్లబ్ సభ్యులు మ్యాకల రమేష్,బత్తిని భూమయ్య,మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,కాటిపెళ్లి రామ్ రెడ్డి,కొమ్ముల ఆదిరెడ్డి,నిమ్మల వెంకట్ రెడ్డి,బొడ్గం అంజిరెడ్డి,ఆడెపు రాం ప్రసాద్,మండలోజు శ్రీనివాస్,బొమ్మకంటి నవీన్,కుర్మ సుదర్శన్,సామల్ల సత్యనారాయణ,పులి రమేష్,వాసం రాజేందర్,సిబ్బంది పాల్గొన్నారు.