|
modi add 1

పెండింగ్ సమస్యలు, పదోన్నతులపై సమగ్ర సమీక్ష – అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన కవిత నాయుడు

సింగరేణి సంస్థ పర్సనల్ విభాగానికి సంబంధించిన వివిధ అంశాలపై సమీక్ష సమావేశం గురువారం ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని జీఎం (పర్సనల్ ఐఆర్) కవిత నాయుడు కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల పర్సనల్ అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలోని అన్ని ఏరియాల పర్సనల్ విభాగాల పనితీరు, ఉద్యోగుల గైర్హాజరు, క్రమశిక్షణ చర్యలు, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, విజిలెన్స్ కేసులు, కార్మిక సంబంధిత సమస్యలు మరియు ఇతర పరిపాలనా అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని ఫైళ్లు, ఉద్యోగుల సమస్యలు మరియు వివిధ అంశాలను ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కవిత నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించడంలో పర్సనల్ విభాగం మరింత చురుకుగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ పీఓలు శ్రావణ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, హనుమంతరావు, అన్ని గనుల సంక్షేమ అధికారులు, పర్సనల్ విభాగ అధికారులు మరియు వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు

By Ambati Sathish kumar | June 18, 2026 | 0 Comments

Hot Categories

2
7
1