పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తూ ఇంటి ముంగిటకే వైద్య సేవలను చేరవేస్తున్న రాయికల్ పట్టణంలో ని "బస్తీ దవాఖాన "అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. ప్రతి రోజు 100 మందికి పైగా ఒపీ వస్తుందంటే ప్రభుత్వ వైద్యంపై సామాన్య ప్రజలకు నమ్మకం ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టం అవుతుంది. నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసింది. ఈ దవాఖానాలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక నర్స్‌లతోపాటు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాబీర్ మహమ్మద్ మాట్లాడుతూ మా బస్తీ దవాఖానాల్లో ఓపీ, ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు, గర్బిణీలు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ కౌన్సెలింగ్, రక్త హీనత, షుగర్, బీపీ, ఇతర ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య పరిరక్షణ-అవగాహన-చైతన్యం వంటి 57 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అంతకు మించిన ఆరోగ్య, అత్యవసర సమస్యలకు రెఫరల్ హాస్పిటల్స్‌గా ఉండే సిహెచ్‌సిలు, ఇతర ప్రభుత్వ దవాఖానాలకు రెఫర్ చేస్తామని పట్టణ పేదలకు సకాలంలో, సరైన వైద్య సంరక్షణ అందేలా చూస్తూ, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడమే మా లక్ష్యం అని తెలియజేశారు.


Comments 0