జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అశోక్ నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్మెట్ తప్పనిసరి, వాహన పత్రాలు కలిగి ఉండటం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్సై G. హరి శేఖర్, పాఠశాల సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.