సుల్తానాబాద్,16(జనం గొంతు): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి అనుదీప్ అన్నారు.జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని గురువారం మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి డెంగీ నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి అనుదీప్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వివిధ రకాల దోమలతో వస్తుందని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిలువలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే దోమలు రాకుండా ఉంటాయని అన్నారు.డెంగ్యూ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని ప్రజలు తమ నివాస స్థలాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ లు సౌందర్య, భారతి, సూపర్వైజర్లు వెంకట్ రెడ్డి, రోజా, రాజేశ్వరి తో పాటు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.