ఇటీవల కల్వచర్ల గ్రామంలో ఒకేరోజు కుక్కల చేసిన దాడుల్లో గాయపడిన 2సంవత్సరాల వయస్సు గల చిన్నారి మహావీర్ చౌహాన్ తీవ్రంగా గాయపడడం జరిగింది. తలకి కంటికి బలమైన గాట్లు పడడం వల్ల ఇప్పటికే చికిత్స చేయుటకు 3 లక్షల వరకు ఖర్చయింది. బాబు తండ్రి సెంటినరీ కాలనీలోని ఒక బేకరీలో కూక్ గా పనిచేస్తున్నారు. మరియొక ఆర్థిక పరిస్థితి చుట్టుపక్కల వారు మజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే మరియు కార్తిక మరియు అత్యవసర చికిత్స పరిస్థితిని పలువురికి తెలియజేయగా చలించిన కుందారపు సంతోష్ 5000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్పందించిన సంతోష్ ను అభినందిస్తూ,ఇంకా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే స్పందించాలని మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మేకల మారుతి యాదవ్,కళాధర్ రెడ్డి,తీగల శ్రీధర్, గొట్టిముక్కల మల్లేష్, మల్లయ్య ,బుస కనకయ్య,రాజు,సది , కనకరా జ్, ఉత్తమ్ సింగ్ పాల్గొన్నారు
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల జగిత్యాల రెండవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు గ్రామీణ ఆర్థిక పరిస్థితులు విశ్లేషణపై కోర్సులో భాగంగా ప్రాంతీయ పరిశోధనా స్థానం దత్త గ్రామమైన అల్లీపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ప్రధాన పంటల గూర్చి రైతుల సాగు ఖర్చులు గూర్చి విద్యార్థులు సమాచారం సేకరించారు అలాగే అల్లీపూర్ రైతు ఉత్పాదక సంస్థలో (ఎఫ్ ఇ ఒ) లో వయ్యారిభామ కలుపు మొక్కల వల్ల జరిగే నష్టాలు గూర్చి శాస్త్రవేత్తలు డాక్టర్ డి ఏ రజనీ దేవి, డాక్టర్ రవి మృతిక శాస్త్రవేత్త వివరించారు పరిసర ప్రాంతాల్లో ఉన్న వయ్యారిభామ కలుపు మొక్కలను విద్యార్థులు తొలగించారు. ఈ కార్యక్రమంలో దత్తత గ్రామ ఇన్చార్జ్ డి ఏ రజనీదేవి, మృతిక ,శాస్త్రవేత్త డాక్టర్ రవి, అగ్రి హబ్ రూరల్ కోఆర్డినేటర్ టి రంజిత్ కుమార్ ఎఫ్ఈఓ అధ్యక్షుడు అత్తినేని శంకర్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలోని వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న భీమన్న ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది ప్రజలు ఆలయంలో ప్రతియోటా ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమికి ప్రారంభం అయి మూడు రోజులు జరిగే భీమన్న జాతరకు చుట్టూ పక్కల జగిత్యాల,మెట్ పల్లి, కోరుట్ల,మల్లాపూర్ ఖానాపూర్, మరియు ఇతర జిల్లా కేంద్రాలు అయినా నిజామాబాద్ ,కరీంనగర్ ఆదిలాబాద్ వేలాదిగా ప్రజలు వచ్చి స్వామివారికి మొ క్కులు చెల్లించుకుంటారు. మూడవ తేదీనాడు ఘనంగా స్వామివారి రథోత్సవం జరుగనున్నది. భీమన్న ఆలయ అభివృద్ధి రీత్యా ఆర్థిక సహాయం అందించాలని భక్తులకు ఆలయ నిర్వాహకులు దేవుని లింగయ్య విజ్ఞప్తి చేశారు. ఆలయం రోడ్డుకు ఇరువైపులా కామన్ లు మరియు ఆలయం చుట్టూ సిసి స్లాబ్ వేయుటకు ఆర్థిక సహాయం చేయుటకు జి పే /ఫోన్ పే నెంబర్ 9441725016,9908645621 సంప్రదించండి.
మన రావికంటి చరిత్ర రావికంటిలో 'మిట్టన గుళ్ళు వంపున చెరువు' నిర్మించిన స్వాభిమాని జైనరాణి లకుమాదేవి! జగిత్యాల్ జిల్లా కేంద్రానికి అటు కోరుట్ల పట్టణానికి కేవలం 15-20 కి మీ దూరంలోనున్నా రాయికల్ ను మారుమూల గ్రామం అనేవారు. నాటి కాలంలో రావికంటి,ప్రభాకరరావు పేట,గోవిందరాజు పేట, బద్దులాపురం( పద్మాపురం ), నందిపేట, నాగారం, కొండాపురం అను ఏడు గ్రామాలు కలిసి ఏర్పడడం వల్ల గ్రామీణులు దీన్ని ఇప్పటికీ 'రావికంటి' అనే పిలుస్తుంటారు. వేములవాడ చాళుక్యుల/ కాకతీయుల కాలంనాటి గుడి, ఒకప్పుడు దాని చుట్టూవున్న కోటను బట్టి 'గుడికోట' గా ప్రసిద్ధమైన ప్రస్తుతం 'శ్రీ కేశవనాథస్వామి ఆలయం'గా పిలువబడుతున్న ఇక్కడి త్రికూటాలయం రాయికల్ కు మాకుటాయామనం లాంటిది. కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు ( 1296-1325) రాజ్యం చేస్తున్న కాలంలో వారి సామంతుడు రుద్రదేవుడు,వారి సేవకుడు బెజగంగూలెంక శకవర్షం 1227 శ్రావణ బహుళ ద్వాదశి వడ్డవారం (క్రీశ1305 ఆగస్టు17మంగళవారం) నాటి దాన శాసనం ప్రకారం ఇది ఆనాడు రామనాథ లఖుమేశ్వర ( లక్ష్మణేశ్వర)ఆలయం. అయితే వేములవాడ రాజధానిగా కరీంనగర్ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యుల కాలంలో ఇది 'జైనాలయం'గా వుండేదని ఈ ఆలయ పరిసరాల త్రవ్వకాల్లో లభించిన జైన తీర్థంకరుని శిరస్సును బట్టి అర్థమౌతుంది. అంతే కాదు ఇక్కడి స్థల చరిత్రలో ఆలయ నిర్మాత గా చెప్పబడే, వైశ్య వనితగా భావించబడే 'లకుమాదేవి 'జైన మతస్తురాలు కావడం విశేషం. ఈ రాణి స్వాభిమానం మహిళా లోకానికే గర్వ కారణం. లకుమాదేవి తన బిడ్డకు పాలిస్తున్న సమయంలో ఆమె మామగారు లోపలికి రావడం , అది ఆమె గమనించక పోవడం జరిగిందట. కోడలు తనను చూసి కూడా లేచి నిలబడలేదని, కుర్చీ పీట వేయలేదని ఆగ్రహించిన ఆ పెద్దాయన ' వంపున చెరువు - మిట్టన గుళ్ళు కట్టించిన రాణిలా మిడిసిపడుతున్నావని' అన్నాడట. ఆత్మభిమానం గల లకుమ బాధ పడుతూనే 'గర్వంతో కాదు మీ రాక గమనించకనే, అయితే మీ వాక్కుల్లో నాకు భవిష్యత్ వాణి వినబడుతుంది, మీరన్న పనులు నేను చేసి చూపుతా'నని ప్రతిన బూని తన తల్లిగారు పెట్టిన ఏడు వారాల నగలను కూడా అమ్మి 'మిట్టన ఈ గుళ్ళు - వంపున చెరువు' నిర్మించిందని చెబుతారు. చెరువు నిర్మాణం పూర్తి అయినా వర్షాభావం వల్ల అది నిండకపోవడాన్ని కొందరు పండితులు తన దోషంగా చెబుతూ చెరువు నరబలి కోరుతుందనడంతో స్వయంగా తానే ఒక అర్ధరాత్రి లేచి సర్వాలంకార భూషితయయి వెళ్లి చెరువులో ఒక గుండు దగ్గర ఊరి కోసం ప్రాణత్యాగం చేసిందన్నది బహుళ ప్రచారంలోనున్న కథ. ఈ మహాసాధ్వి పేరుతో ఇప్పటికీ అది 'లకుమాదేవి గుండు 'గానే పిలువబడుతుంది. కాకతీయుల కాలం నాటి 'బెజగంగూలెంక దాన శాసనాన్ని' లెక్కలోకి తీసుకున్నా రాయికల్ దాదాపు ఏడున్నర శతాబ్దాల నాటి చారిత్రక గ్రామం. 'మాధవ చరిత్ర(అముద్రితం) 'కర్త తిరునగరి నర్సింహదాసు, రామశతక కర్త వరకవి భూమగౌడు (వీరి జీవిత ఆధారంగా నేను రచించిన నవల ఇదే పేరుతో 2017 లో వెలువడింది. కీ శే వేముల పెరుమాళ్ళు గారు రాయికల్ మండల మొదటి అధ్యక్షులు(1987-1993)కావడమే కాకుండా 'శ్రీ కేశవనాథ స్వామి ఆలయ' చరిత్రను వెలికితీసి దీని అభివృద్ధికి విశేషంగా కృషి చేసినారు. మహాశివరాత్రి సందర్భంగా మన "గుడి కోట" ఆలయంలో ధన,వస్తు రూపేనా సహాయం చేయవలసిన వారు గుడి కోట ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి "సాంబరు శ్రీనివాస్" ఫోన్ పే నెంబర్ 9030159587 కి పంపించగలరు.
Your experience on this site will be improved by allowing cookies.