రాయికల్ పట్టణం గుడికోట ఆలయం లో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆఖరి ఘట్టమైన శివపార్వతుల రథోత్సవం కనుల పండుగ సాగింది. ఆదివారం ఆలయ కమిటీ మరియు ప్రధాన అర్చకులు మంగోలి సతీష్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మునుగోటి రమేష్ శర్మ శివపార్వతుల కళ్యాణం, అభిషేకం మరియు స్వామివారికి బిల్వార్చన తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రోజున స్వామి వారి దర్శనం,రథోత్సవం డప్పు చప్పుల్లు మరియు మంగళవారం వాయిధ్యాలు మధ్యన కన్నుల పండుగ సాగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మంతెన మహేందర్, కోశాధికారి సాంబారు శ్రీనివాస్ లతోపాటు ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.