రాయికల్ మున్సిపాలిటిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది ఎక్కడ చూసినా చెత్త కుప్పల దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో గుట్టలుగా పేరుకు పోయింది. రోజు చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు రావడంలేదని, వాహనం మరమ్మత్తు కొస్తే వారం పది రోజుల వరకు చెత్త సేకరించె నాధుడే కనిపించారు.ఒకవేళ వస్తే సమయపాలన ఉండదు. దీంతో కొన్ని ప్రాంతంలో ఇంటిలో చెత్త నిల్వ చేయలేక ప్రజలు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. కాలనీలలో స్వచ్ఛ ఆటోలు రావడంలేదని నూతన పాలకవర్గం స్పందించి కాలనీలో రోజు చెత్త సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.