ఒక్కరి కోసం అందరు... అందరి కోసం ఒక్కరు...! .. మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు మనమంతా ఐక్యంగా ఉండి సమస్యలు ఎదురైనప్పుడు ఒక్కరి కోసం అందరు .. అందరి కోసం ఒక్కరుగా కలిసికట్టుగా *ముందుకు సాగాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు అన్నారు . రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ మహోత్సవం కార్యక్రమం పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ హాజరై 2025 -27 సంవత్సర నూతన అధ్యక్షులుగా భోగ రాజేశం,ఉపాధ్యక్షుడిగా దాసరి గంగాధర్,ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేష్,కోశాధికారిగా ఆడెపు నర్సయ్య లచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత సంవత్సరం చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు.సంఘ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు సంఘంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సభ్యులకు సమాచారం అందిస్తూ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలపాలని సూచించారు.మనందరం ఐక్యంగా ఉంటే భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు పొందేందుకు తోడ్పడుతుందన్నారు.సంఘం ఎన్నికలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం మాత్రమేనని తదనంతరం అందరం కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా ఎదగాలన్నారు.విద్యార్థులకు విద్య పట్ల ప్రోత్సాహం,విద్య ఉపకరణాల కల్పన,ఆరోగ్యం,నిరుపేదలకు ప్రోత్సాహం లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.అనంతరం నూతన అధ్యక్షులు భోగ రాజేశం మాట్లాడుతూ సంఘ సభ్యులు సహకారంతో పద్మశాలి సేవా సంఘ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,రాష్ట్ర కార్యదర్శి జక్కుల చంద్రశేఖర్,మాజీ కార్యదర్శి మామిడాల లక్ష్మీనారాయణ మాజీ ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్యనారాయణ, సిరిపురం రఘు,మాజీ కోశాధికారి నర్సయ్య ఫోపా అధ్యక్షులు ఎలిగేటి రాజ్ కిషోర్,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి *ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి అనుమండ్ల తేజ ,గంట్యాల ప్రవీణ్ పోప సభ్యులు దాసరి రామస్వామి,గాజంగి రాజేశం, సింగని రాందాస్,సామల్ల గంగాధర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అక్రమనిర్బంధాలు మందిర నిర్మాణాన్ని అడ్డుకోలేవు ; VHP అరెస్టులు, గృహ @ ముస్లిం మెప్పుకోసం హిందూ మందిరాల ధ్వంసం @ పోలీసులను ముందు పెట్టి భయ బ్రాంతులు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం @ అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్యమం ఆగదు @ రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమించి మందిరం నిర్మించి తీరుతాం @ హిందువుల మనోభావాలు గౌరవించి మందిరం నిర్మించి తీరాల్సిందే..! @ తరతరాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి @ సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని తొక్కిపెట్టడమేనా..? @ నిజాం వారసత్వాన్ని అందుకొని హిందువులపై దాడులకు దిగితే తగిన బుద్ధి చెప్పక తప్పదు..! పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ట్ర కోకన్వీనర్ సుభాష్ చందర్ విమర్శించారు. ముస్లింల మెప్పు కోసం హిందూ మందిరాలను ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు కొనసాగాయి. మంగళవారం రోజు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ మందిరం దగ్గర కుంకుమార్చన నిర్వహించాలని చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అటువైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి కార్ఖానా, బోయిన్పల్లి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలను విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దమ్మ తల్లి మందిరం నిర్మించి, హిందువుల మనోభావాలు గౌరవించాల్సిందే నని పట్టుబట్టారు. మందిరం నిర్మించే వరకు పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ,భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం, గృహాల్లో నిర్బంధించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనకు తిరతిస్తున్నదని దానిని హిందూ సమాజం ఒప్పుకోదని హెచ్చరించారు. బడుగుల పండుగ అయిన బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా నిలిచే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలపై దాడి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో సహా నాయకులందరినీ అరెస్టు చేసి పెద్దమ్మ తల్లి పూజకు దూరం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతామని విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు. రాబోవు రోజులలో రెట్టింపు స్థాయిలో ముందుకు వెళ్లి మందిరాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. సెక్యులరిజం పేరుతో హిందూ సమాజాన్ని తొక్కి పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. పెద్దమ్మ తల్లి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించకుండా దాదాపు 1200 మంది పోలీసులను మోహరించడం నిజాం పరిపాలనకు నిదర్శనం అన్నారు. దాదాపు 2000 మంది బజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టు చేసేదాకా వదలమని పోలీసులు హెచ్చరించడం దుర్మార్గమని నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రధాన పీఠ వేస్తున్నారని, అదే సమయంలో హిందువుల మనోభావాలను పూర్తిగా విస్మరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరును విశ్వహిందూ పరిషత్ నేతలు తప్పు పట్టారు. తరతరాలుగా పూజలందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని అపవిత్రం చేసి, మందిరాన్ని ధ్వంసం చేసి , హిందువులపై ఘోరమైన కేసులు నమోదు చేయడం , లాఠీచార్జ్ చేయడం, మహిళలను చితకబాదడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. అమ్మవారి విగ్రహాన్ని అపవిత్రం చేసి, విగ్రహాన్ని తరలించి, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల మాదిరి హిందూ నాయకులపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, భయభ్రాంతులకు గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారు హెచ్చరించారు. నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అన్నింటిని ఎదుర్కొని.. పెద్దమ్మతల్లి పవిత్రతను కాపాడి భవ్యమైన మందిర నిర్మాణం నిర్మాణం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. అరెస్టులు, అక్రమ కేసులు తమకు కొత్త కాదని.. లక్ష్యం చేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని విశ్వహిందూ పరిషత్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భవదీయ పగుడాకుల బాలస్వామి ప్రచార ప్రముఖ్ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం 99129 75753 9182674010
మధ్య భారత మహారాణి అహల్యాబాయి హోల్కర్ 230వ వర్ధంతి ఆగస్టు 13న రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంద్దాం : పూలే బి సి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ తేదీ:12-8-2025 మంగళవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా గల సంఘం కార్యాలయంలో పత్రికా మిత్రులతో పూలే బి సి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ మాట్లాడుతూ మధ్యభారత మహారాణి అహల్యాబాయి హోల్కర్ 1725 మే 31న మహారాష్ట్రలోని అహ్మదాబాద్ జిల్లా, చండీ గ్రామంలో సాధారణ గొర్రెల కాపరి అయిన (దన్గర్) మంకోజి షిండే, సుశీల షిండే గార్లకు జన్మించినారన్నారు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే మల్హార్ ప్రాంత మహారాజు, మరాఠ సామ్రాజ్యం రాజు మల్హర్రావు హోల్కర్ పూణేకి వెళ్లే దారిలో ఒక శివాలయాన్ని సందర్శించినప్పుడు అహల్యబాయి 8 సంవత్సరాల బాలిక యొక్క భక్తి , వ్యక్తిత్వానికి ముగ్దుడై కోడలుగా ఆమెని ఎంచుకొని వారి తల్లి దండ్రులను ఒప్పించి 1733 లో వారి కుమారుడైన 10 సంవత్సరాల ఖండేబ హోల్కర్ కు ఇచ్చి ఘణంగా వివాహం జరిపించినారన్నారు. ఆమె వివాహ అనంతరం వారి అత్తగారైన గౌతమి హోల్కర్ సలహాలు, సూచనలతో రాజ నీతిలో, యుద్ధ విద్యలో వారి ప్రోత్సహంతో నేర్చుకుని స్వయంగా యుద్ధంలో పాల్గొన్న మహారాణి అహల్యబాయి అన్నారు. భర్త యుద్ధంలో, మామ వృద్ధాప్యంతో, కుమారుడు అనారోగ్యముతో ఒకరి తర్వాత ఒకరు మరణించడం జరిగిందన్నారు. కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉన్న , ఎన్నో కష్టాలను ఎదుర్కొని, రాజ్యంలోని ప్రజల బాగోగుల కోసం రాజ్యపాలన బాధ్యతలు చేపట్టి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని, నర్మదా నదిలో స్నానం ఆచరించి, మట్టితో శివ లింగం ఏర్పాటు చేసి శివ లింగం సాక్షిగా ప్రజాపాలన గావించిన మహారాణి అన్నారు. అహల్యా భాయి హోల్కర్ ఆమె తన 30 సంవత్సరాల పాలనలో, 70 సంవత్సరాల జీవితంలో కాశీ నుండి కన్యాకుమారి వరకు 108 శివ లింగాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా భారతదేశంలో 157 ఆలయాలను కాశీ నుండి కన్యాకుమారి వరకు ఆలయల పునఃరుద్ధరించి, విగ్రహ పుణః ప్రతిష్ట, గతంలో విదేశీయులచే దాడి చేయబడ్డ పురాతనమైన విగ్రహాల నిర్మాణం, రోడ్లు వేయడం, సత్రాల నిర్మాణం చేసిన మహనీయులన్నారు. దాన, ధర్మాలతో వారసత్వముగా వచ్చిన తమ ఆస్తులను ఖర్చుచేస్తూ ఆనాటి ప్రజల ఆదరణ పొంది ఒక దైవం పంపిన దూతగా భావించి ప్రజల పూజలందుకున్న మహా రాణి అన్నారు. ప్రస్తుతం విశ్వ విద్యాలయాలకు, జాతీయ రహదారులకు, ఇండోర్ విమానాశ్రయాకి వారి పేరు పెట్టడం జరిగినదన్నారు. కావున వారి 230వ వర్ధంతి (13-8-1795) రాష్ట్ర వ్యాప్తంగా 13-8-2025 బుదవారము రోజున జరుపుకొంద్దామని , వారి జీవిత చరిత్రను నేటి తరానికి, విద్యార్థులకు, ప్రజలకు తెలియజేస్తూ అలాగే వారి జీవిత చరిత్ర ను పాఠ్య పుస్తకాల్లో చేర్పించాలని కోరుచున్నామన్నారు.
గోదావరిఖని ఎల్బీ నగర్‌కి చెందిన కారు డ్రైవర్ మారుపెల్లి ప్రణయ్ భాస్కర్ (29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరాయికి తీసుకున్న, స్నేహితుల వద్ద నుండి తెచ్చుకున్న నాలుగు కార్లను ఇతరుల వద్ద తనఖా పెట్టి సుమారు రూ.10 లక్షలు తీసుకొని మోసపూరితంగా వినియోగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, 4 కార్లు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ వాహనాలు తనఖా పెట్టే ముందు యజమాని వివరాలు, పత్రాలు ఖచ్చితంగా పరిశీలించాలంటూ ప్రజలకు సూచించారు.
రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం ముందస్తు రక్ష బంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చిన్నారులు వివిధ రకాలైన వృత్తుల వేషధారణలో వచ్చి అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ జే వేణుగోపాల్ రావు మాట్లాడుతూ రక్షాబంధన్ అంటే సోదరి సోదరుల అనుబంధమే కాకుండా ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలని విద్యార్థులకు సూచించారు. రక్షా బంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది సోదర ప్రేమ, రక్షణ మరియు బాధ్యతలను గుర్తుచేసే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా, మనం మన కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవాలి, అలాగే సమాజంలో సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. మనదేశంలో ఇంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారంటే దానికి నిరంతరం శ్రమించే కొన్ని వృత్తులు వారి త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి దేశ రక్షణకై సమాజ సేవకై పాటుపడాలని వివరిస్తూ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి విద్యార్థి తన ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని ప్రిన్సిపల్ వేణుగోపాల్ రావు విద్యార్థులకు సూచించారు తదనంతరం తరగతి విద్యార్థులు అందరూ ఒకరికి ఒకరు రాఖీ కట్టుకొని "నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష "అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గారు జే తిరుపతి రావు గారు, ప్రిన్సిపల్ జె వేణుగోపాల్ రావు ,ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచింది "చేనేత" కళ అని రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. మనిషికి నాగరికతను అద్దింది నేత కార్మికులని పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.ప్రాచీన కాలం నుంచే మన దేశంలో మగ్గాల ద్వారా చేనేత ఉత్పత్తి జరిగిందని మొదట్లో ఈ విధానంతో వస్త్ర ఉత్పత్తికి చాలా సమయం పట్టేదన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన జాన్ కే 1733 లో ఫ్లై షటిల్ ను కనిపెట్టాక మగ్గం ద్వారా వస్త్రాల ఉత్పత్తి సామర్థ్యం బాగా పెరిగింది అన్నారు.1801 లో జోసెఫ్ ఎం జాకార్డ్ పెద్ద డిజైన్లు రూపొందించే పరికరాన్ని తయారు చేయగా ప్రస్తుతం చేనేత రంగంలో ఉపయోగిస్తున్నారని ఆ పరికరాన్ని జాకార్డ్ గా పిలువ పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్,కోశాధికారి ఆడెపు నర్సయ్య,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి గంట్యాల ప్రవీణ్,మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,మ్యాకల కాంతారావు,గాజంగి అశోక్,బొమ్మ కంటి గోపాల్, సభ్యులు మచ్చ నారాయణ,మామిడాల లక్ష్మీనారాయణ,వాసం స్వామి,దాసరి గంగాధర్,దిలీప్,లక్ష్మీనారాయణ,ప్రభాకర్,గంగన్న,మధు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన సుమారు 130 ట్రాక్టర్ల ఇసుక డంపులను పోలీసులు గుర్తించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలో ఇసుకను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, “ఇసుకను స్వలాభం కోసం అక్రమంగా నిల్వ చేస్తే ఉపేక్షించము. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవు” అంటూ హెచ్చరించారు.
రాయికల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించి సుమారు 50 మంది బాలింతలకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ లయన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ బిడ్డకు సరిపడా పాలు ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడే తల్లి పౌష్టికాహారం తీసుకోవాలని. ప్రోటీన్లు ఉండే పాలు, చేపలు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని. దీనివల్ల బిడ్డకు సరిపడా పాలు పుష్కలంగా లభిస్తాయని,తల్లికి కలిగే ప్రయోజనాలు బిడ్డకు ముర్రుపాలు పట్టడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో రొమ్ము, అండాశయ క్యాన్స ర్లు, మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుం ది. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు. గర్భదారణకు పూర్వం ఉండే బరువును మళ్లీ పొందవచ్చు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువల ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో డయాబెటిక్ డిస్టిక్ కోఆర్డినేటర్ బత్తిని భూమయ్య, రాయికల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి , వాసం ప్రసాద్, వెంకట్ రెడ్డి, ప్రసాద్ ,సుధవేణి మురళి ,సాంబారు శ్రీనివాస్ ,మరియు డాక్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు,
జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు నూతన జిల్లా కార్యవర్గానికి ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చీటి శ్రీనివాస్ మాట్లాడుతూ, "జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం,ఆరోగ్య కార్డులు,బీమా వంటివి అందించేందుకు కృషి చేస్తాను. జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిలా పనిచేస్తున్నారు. కానీ వారి సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావడం లేదు. వాటిని అధికారులకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను," అని అన్నారు. రాయికల్‌కి చెందిన జర్నలిస్టులు ఐక్యతతో ఉన్నందుకు అభినందించిన ఆయన, ఇతర ప్రాంతాల్లో కూడా ఇది ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, అల్లె రాము, సంయుక్త కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి, ఇందూరి నరేష్, బూరం లక్ష్మణ్, పెరంబుదూరు శ్రీకాంత్, రాయికల్ ప్రెస్ జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ ఏ.ఎం. రాజు రెడ్డి, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్, సీనియర్ పాత్రికేయులు సింగిడి శంకర్, ముజాఫర్, బొంగోని శ్రీనివాస్, సింగని శ్యాంసుందర్, వాసం లింబాద్రి,గంట్యాల ప్రవీణ్, ఇమ్మడి విజయ్, తీగల గోపి, శ్రీను, వెంకటేష్, కిరణ్ రావు, నరేష్, శంకర్, షాకీర్, రమాపతిరావు, గంగాధర్, భీమరాజు, కళ్యాణ్, రషీద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన జింక మల్లేశంను ఈరోజు ఉపాధ్యాయ బృందం ఆత్మీయంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల చదువు ప్రమాణాలు మెరుగుపరచడం, పాఠశాలల సౌకర్యాలు అభివృద్ధి చేయడం, విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధించడం కోసం కలిసి కృషి చేస్తామని ఉపాధ్యాయులు అన్నారు. మల్లేశం కూడా అందరి సహకారంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.